స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపును హైకోర్టు వాయిదా వేసింది. ఈ అంశం పై ఆగస్టు 4వ తేదిన విచారణ చేపట్టినట్టు హైకోర్టు ప్రకటించింది. దీంతో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రతిష్టంభన కొనసాగనుంది. ఎన్నికల సంఘం సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించకుండా ఎన్నికలు నిర్వహించినందున.. ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఓట్ల లెక్కింపును రద్దు చేసింది. ఈ ఆదేశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్ట్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. తాజాగా దీనిపై విచారణ వాయిదా పడింది.