NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కొన‌సాగుతోన్న ఓట్ల లెక్కింపు

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. ఉద‌యం 8 గంట‌ల‌కు లెక్కింపు ప్రక్రియ మొద‌లైంది. ఏపీలో కృష్ణా, గుంటూరు, ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు గుంటూరు, కాకినాడ‌లో జ‌రుగుతోంది. తెలంగాణ‌కు సంబంధించిన మ‌హ‌బూబ్ న‌గ‌ర్,రంగారెడ్డి, హైదరాబాద్ ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాల ఓట్ల లెక్కింపు స‌రూర్ న‌గ‌ర్ ఇండోర్ స్టేడియంలో జ‌రుగుతోంది. వ‌రంగ‌ల్-న‌ల్గొండ‌-ఖ‌మ్మం ప‌ట్టభ‌ద్రల నియోజ‌క‌వ‌ర్గ ఓట్ల లెక్కింపు న‌ల్గొండ‌లోని అర్జాల బావి ప్రభుత్వ గిడ్డంగుల భ‌వ‌నంలో జ‌రుగుతోంది. ఈ ఎన్నిక‌ల్లో ఓటింగ్ భారీగా న‌మోదు కావ‌డం… పోటీప‌డిన అభ్యర్థుల సంఖ్య కూడ ఎక్కువ‌గా ఉండ‌టంతో ఎన్నిక‌ల ఫ‌లితం వెలువ‌డేందుకు మ‌రింత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది.

About Author