PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల శిక్షణా కార్యక్రమానికి కౌంటింగ్ సూపర్వైజర్లు తప్పకుండా హాజరు కావాలి

1 min read

జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు…

పల్లెవెలుగువెబ్​, కర్నూలు, సెప్టెంబర్ 18: ఎం పి టి సి, జెడ్ పి టి సి ఎన్నికలు-2021 సందర్భంగా మండల స్థాయిలో నిర్వహించే శిక్షణా కార్యక్రమానికి కౌంటింగ్ సూపర్వైజర్లు తప్పక హాజరుకావాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎం పి టి సి, జెడ్ పి టి సి ఎన్నికల కౌంటింగ్ ఇంచార్జి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు మాట్లాడుతూ ఎం పి టి సి,జెడ్ పి టి సి ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నేడు మండల హెడ్ క్వార్టర్ లలో కౌంటింగ్ సూపర్వైజర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి కౌంటింగ్ సూపర్వైజర్లు తప్పక హాజరుకావాలని శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కావున కౌంటింగ్ ఇంచార్జి అధికారులు కౌంటింగ్ సూపర్వైజర్లు 100% హాజరు అయ్యేటట్లు చూడాలన్నారు. ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ లో ఎటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా కౌంటింగ్ సూపర్వైజర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. కౌంటింగ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సమన్వయంతో విధులు నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఎం పి టి సి జెడ్ పి టి సి ఎన్నికల కౌంటింగ్ కు 47 శాఖల నుంచి కౌంటింగ్ సూపర్వైజర్లు 2137, కౌంటింగ్ అసిస్టెంట్లు 4274 మంది మొత్తం 6411 మంది సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ఎం పి టి సి, జెడ్ పి టి సి ఎన్నికల కౌంటింగ్ వివరాలు ఎప్పటికప్పుడు తెలిపేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కంట్రోల్ రూమ్ నందు కమ్యునికేషన్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. విధులు నిర్వహించే అధికారులు వారికి కేటాయించిన మండలాల నుంచి ఎప్పటికప్పుడు ఎన్నికల సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల కౌంటింగ్ ఇన్చార్జ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author