PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ళాశాల‌లో పోర్నోగ్ర‌ఫీ పై కోర్సు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అమెరికాలోని ఓ కాలేజీ మొట్టమొదటిసారిగా పోర్నోగ్రఫీపై కోర్సును ప్రవేశపెట్టింది. 2022–23 విద్యాసంవత్సరంలో ఈ కోర్సు ఉంటుందని ఉటాలోని వెస్ట్‌మినిస్టర్‌ కాలేజీ ప్రకటించింది. లైంగికావయవాలను గురించి, వివిధ రకాల లైంగిక చర్యల గురించి కోర్సులో బోధిస్తామని తెలిపింది. కోర్సులో భాగంగా లెక్చరర్లు, విద్యార్థులు తరగతి గదిలోనే కలిసి కూర్చుని పోర్న్‌ సినిమాలను తిలకిస్తూ స్త్రీ, పురుష లైంగిక సంబంధాలపై జాతి, వర్గం, లింగ విభేదాల ప్రభావం గురించి చర్చలు జరుపుతారని తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

                                        

About Author