విచారణకు.. ఏపీ డీజిపికి కోర్టు పిలుపు !
1 min readపల్లెవెలుగువెబ్: ఏపీ హైకోర్టు మరోమారు రాష్ట్ర పోలీసు శాఖ బాస్ (డీజీపీ)ని విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం జరిగిన ఓ కేసు విచారణ సందర్భంగా పోలీసు అధికారులు నిబంధనలు పాటించడం లేదన్న పిటిషన్ వాదనలతో స్పందించిన హైకోర్టు తదుపరి విచారణకు డీజీపీ హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. పోలీసు అధికారులు నిబంధనలకు అనుగుణంగా ఎందుకు పనిచేయడం లేదన్న విషయాన్ని వివరించాలని డీజీపీని కోర్టు ఆదేశించింది.