PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ కోవిడ్​’ అడ్మిషన్లు… ఆన్​లైన్​లోనే..!

1 min read
జూమ్​వీసీలో మాట్లాడుతున్న కలెక్టర్​ ఇంతియాజ్​

జూమ్​వీసీలో మాట్లాడుతున్న కలెక్టర్​ ఇంతియాజ్​

– రోగుల్లో ఆత్మస్థైర్యం నింపండి
– జూమ్​ వీసీలో ప్రైవేట్​ ఆస్పత్రుల యాజమాన్యాలకు సూచించిన కలెక్టర్​
పల్లెవెలుగు వెబ్​, విజయవాడ : కరోనా స్ట్రెయిన్ తీవ్రత దృష్ట్యా ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 73 ఆసుపత్రులకు అనుమతివ్వడం జరిగిందని కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయం నుండి ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణాజిల్లాలో ప్రభుత్వా సుపత్రులతోపాటు ప్రైవేట్ వైద్యఆసుపత్రులకు కోవిడ్ సేవలు అందించేందుకు అనుమతి ఇచ్చామని, రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.నెం. 77 ను అనుసరించి ఆరోగ్యశ్రీ సేవలను అందించాల్సి ఉంటుందన్నారు.
ఆన్​లైన్​లో…అడ్మిషన్లు : జిల్లాలో 58 కోవిడ్ ఆసుపత్రుల స్థాయిని 73 కు పెంచామని, 3500 నుంచి 4377 పడకల స్థాయిని పెంచామన్నారు.
జిల్లా కోవిడ్ 104 కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా హాస్పిటల్​లో అడ్మిషన్లు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నామన్నారు. బాధితు డిశ్చార్జిలు కూడా ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టరు స్పష్టం చేశారు. అదేవిధంగా తక్కువ లక్షణాలు ఉండేవారికోసం రెండు వేల కోవిడ్ కేర్ సెంటర్ల బెడ్ల స్థాయిని 2,900 కు పెంచామన్నారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి కార్యాలయ కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, కృష్ణాజిల్లా కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ కె. సునీత, జాయింట్ కలెక్టరు, జిల్లా కోవిడ్ నోడల్ ఆఫీసర్ యల్. శివశంకర్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా. బాలసుబ్రహ్మణ్యం, అడిషనల్ డియం హెచ్ డా. ఉషారాణి, కోవిడ్ ఆసుపత్రుల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

About Author