NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కోవిడ్​ కట్టడికి.. దాతలు ముందుకు రండి..!

1 min read
కలెక్టర్​ ఎస్​. వెంకటరావుకు చెక్కు అందజేస్తున్న రిశికాంత్​ అగర్వాల్​

కలెక్టర్​ ఎస్​. వెంకటరావుకు చెక్కు అందజేస్తున్న రిశికాంత్​ అగర్వాల్​

– నవదుర్గా బిల్లేట్​ ప్రైవేట్​ లిమిటెడ్​ యాజమన్యాన్ని అభినందించిన కలెక్టర్​
పల్లెవెలుగు వెబ్​, మహబూబ్​నగర్​ : కోవిడ్​ నివారణకు దాతలు సహకారం అందించడం సంతోషించదగ్గ విషయమని కలెక్టర్​ ఎస్​. వెంకటరావు అన్నారు. గురువారం నవ దుర్గా బిల్లేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన డైరెక్టర్ రిశికాంత్ అగర్వాల్ కలెక్టరేట్​లోని కలెక్టర్​ ఎస్​. వెంకటరావును కలిసి.. రూ.5లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవదుర్గా బిల్లేట్ ప్రైవేట్ లిమిటెడ్ కరోనా నివారణ కార్యక్రమాల కు సహకారం అందించడం సంతోసకరమన్నారు. కరోన విపత్తు ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని, ఇందుకు చేయూతగా నవ దుర్గా బిల్లేట్ లిమిటెడ్ ముందుకు వచ్చి ఆర్థిక సహకారం అందించడం అభినందనీయమన్నారు. కరోన కష్టకాలంలో దాతలు ముందుకు వచ్చి పేద ప్రజలకు అవసరమయ్యే మందులు ,ఆక్సిజన్, శానిటేషన్ ,పారిశుద్ధ కార్యక్రమాలకు సహకారం అందించడం వల్ల వారిలో మనో ధైర్యాన్ని నింపిన వారమమవుతామని ఈ సందర్భంగా కలెక్టర్​ ఎస్​. వెంకటరావు పేర్కొన్నారు.

About Author