PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోవిడ్​ కట్టడికి.. ప్రత్యేక చర్యలు

1 min read
మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి

మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి

– జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండండి
– రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కోవిడ్​ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, జిల్లా అధికారులు, వైద్యాధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి సూచించారు. సోమవారం కర్నూలు స్టేట్​ గెస్ట్​ హౌస్​ హాల్​లో జిల్లా ఇన్​చార్జ్​ కలెక్టర్​ రాం సుందర్​ రెడ్డి, ఎస్పీ డా. ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్లతో కలిసి కోవిడ్ నోడల్ కమిటీ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో 15,24,617 మందికి టెస్టింగ్ చేయడం జరిగిందని అందులో 1,07,978 మందికి పాజిటివ్ నమోదు కాగా పాజిటివ్ రేట్ 7.08, డేత్స్ 679, ఫటాలిటీ రేట్ 0.63, డిచార్జెస్ 99,631, రికవరీ రేట్ 92.27, యాక్టివ్ కేసెస్ 7,668, యాక్టీవ్ రేట్ 7.10 కలదని, జిల్లాలో కొవిడ్‌ నియంత్రణకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై ఇంఛార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్, ప్రజాప్రతినిధులకు వివరించారు.
పీఎస్​ఏ కెపాసిటీ.. ఎంత ?
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో ప్రకృతి నుంచి ఆక్సిజన్‌ తయారు చేసే (పీఎస్‌ఏ) ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ కెపాసిటీ ఎంత అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ అడగగా….. నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుందని ఏపీఎంఎస్ఐడిసి ఈఈ సదాశివ రెడ్డి మంత్రికి వివరించారు. ఆక్సిజన్ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఆక్సిజన్ రెగ్యులేటర్, పైప్లైన్, వాల్స్, ఆక్సిజన్ లీక్ కాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతూ, ఆక్సిజన్ వార్డులలో టెక్నీషియన్, నర్సులు విజిట్ చేస్తూ ఆక్సిజన్ వేస్ట్ కాకుండా పర్యవేక్షించి మానిటరింగ్ చేయాలని మంత్రి సూచించారు.


ఆరోగ్యశ్రీ కింద.. 50శాతం బెడ్లు
ప్రైవేట్​ ఆస్పత్రులలో 50 శాతం కోవిడ్​ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద బెడ్స్​ కేటాయించాలని, అలా చేయని ఆస్పత్రి యజమానులపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఎక్కువగా వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్​పై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్​ డా. సుమన్​ ఆదేశించారు. అనంతరం నంద్యాల ఎంపీ బ్రహ్మానంద రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​, కోడుమూరు ఎమ్మెల్యే డా. సుధాకర్​, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్​ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ పలు సమస్యలను జిల్లా అధికారులు, మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి, నగర మేయర్ బి.వై.రామయ్య, జేసీ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సమూన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, నగర కమిషనర్ డి.కె బాలాజీ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డి.ఆర్.ఓ పుల్లయ్య, ఆర్డీఓ హరిప్రసాద్, డిఆర్డీఏ పిడి వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈఓ వెంకట సుబ్బయ్య, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జిక్కి, ఇంచార్జి డిఎంహెచ్ఓ డా. మోక్షేశ్వరుడు, డా.వైఎస్సార్ ఆరోగ్య శ్రీ చీఫ్ మెడికో డాక్టర్ ఇలియాస్, కోవిడ్ 19 జిల్లా నోడల్ కమిటీ అధికారులు, ఆర్ అండ్ బి ఎస్ఈ జయరామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author