కోవిడ్ కేర్ సెంటర్ పరిశీలన
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు : కర్నూలు టిడ్కో కోవిడ్ కేర్ సెంటర్ను జేసీ–3(ఆసరామరియు సంక్షేమం) ఎంకేవీ శ్రీనివాసులు పరిశీలించారు. అక్కడ చికిత్సపొందుతున్న బాధితులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారా లేదా… అని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీఓ హరిప్రసాద్, కోవిడ్ కేర్ సెంటర్స్ జిల్లా నోడల్ అధికారి , డీడీ సోషల్ వెల్ఫేర్ రమాదేవి తదితరులు ఉన్నారు.