కోవిడ్ సంక్షోభం.. దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్: దేశంలో కరోన కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు ఆక్సిజన్ కొరతతో ఆస్పత్రులు అల్లాడుతున్నాయి. అయినా స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో కదులుతున్నాయి. కరోన నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం మార్కెట్లు భారీ లాభాలతో కదులుతున్నాయి. 11:30 నిమిషాల సమయానికి నిఫ్టీ- 180 పాయింట్లు లాభపడి.. 14,510 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 800 పాయింట్లు లాభపడి 32,500 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే.. ఈ లాభాలు ఎంత వరకు నిలబడతాయి అన్నదే ప్రశ్న. మధ్యాహ్నం కనుక విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగితే.. మార్కెట్లు నష్టపోయే అవకాశం ఉంది. మరోవైపు అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందన్న వార్తలు మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ ను బలపరిచాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియగా.. ఆసియా మార్కెట్లు పాజిటివ్ గా కదులుతున్నాయి.