PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోవిడ్​ బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిందే..

1 min read

– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ బాధితులను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంగళవారం రాయచోటి పార్టీ కార్యాలయంలో ‘ సాధన దీక్ష ’ చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవాలని, తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.10వేల తక్షణ సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోన పరిస్థితులు కొనసాగినంతకాలం ఆయా కుటుంబాలకు రూ.7,500 , కొవిడ్‌తో మరణించిన ప్రతి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం, ఆక్సిజన్‌ కొరతతో మరణించిన వారి కుటుంబాలకు రూ.25లక్షలు చెల్లించాలనే డిమాండ్ చేశారు. కరోనాకు ప్రపంచ దేశాలన్నీ భయపడితే జగన్ మెహన్ రెడ్డి తేలిగ్గా తీసుకున్నారని విమర్శించారు.కరోన పై ముందు జాగ్రతలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ భాషా, పట్టణ అధ్యక్షులు ఖాదర్ వలి, సంబేపల్లె మండల అధ్యక్షులు రెడ్డయ్య యాదవ్, మాజీ జెడ్పీటీసీ నర్సారెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షులు అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ టిఎన్ఎస్ఎఫ్ నాయకులు అబ్బవరం సాయి, దేవేంద్ర, జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి వతన్ నిసార్, న్యూ ఆంధ్ర ముబారక్, తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్డయ్య, మైన్ ఉద్దీన్, అభుజర్, అతావుల్ల, మహబూబ్ అలీ మాజీ ఎంపీపీ ఉమాపతి రెడ్డి సుభాన్ జిల్లా టిడిపి ప్రచార కార్యదర్శి నూలివీడు శివారెడ్డి రాయచోటి పట్టణ మైనారిటీ మహిళా నాయకురాలు హాజీ రా అమీర్ భాషాపాల్గొన్నారు.

About Author