ఐదు ఆస్పత్రుల కోవిడ్ సర్వీస్ లైసెన్స్ రద్దు..!
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన బాధితుల నుంచి అధికంగా బిల్లులు వసూలు చేస్తున్న ఆస్పత్రుల మీద తెలంగాణ ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. హైదరాబాద్ లోని ఐదు ఆస్పత్రుల కోవిడ్ సర్వీస్ లైసెన్స్ ఆరోగ్య శాఖ రద్దు చేసింది. బంజారాహిల్స్ లోని విరించి ఆస్పత్రి, బేగంపేటలోని విన్ ఆస్పత్రి , కాచిగూడలోని టీఎక్స్ ఆస్పత్రి, కేపీహెచ్బీలోని మ్యాక్స్ హెల్త్, సనత్ నగర్ లోని నీలిమ ఆస్పత్రి కోవిడ్ సర్వీస్ లైసెన్స్ ఆరోగ్య శాఖ రద్దు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు 64 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.