PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఉపాధి’ కూలీలకు కోవిడ్ పరీక్ష

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది : మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాలకు వెళ్లి.. కూలీలకు కోవిడ్​ పరీక్షలు నిర్వహించారు వైద్యాధికారులు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. సోమవారం మసీదుపురం, బొల్లవరం గ్రామాల్లో పని చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు తిమ్మాపురం పీహెచ్​సీ వైద్యాధికారి డా. చంద్రశేఖర్​, చిన్నలింగన్న ఆధ్వర్యంలో సిబ్బంది కోవిడ్​ పరీక్షలు చేశారు. మసీదుపురం లో 106, బొల్లవరం లో 62 శాంపిల్స్ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు తరలించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్బరాజు ,ఏ పీ ఓ మనోహర్ ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మరియు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

About Author