PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘కోవిడ్’ టీకా.. ఆరోగ్యానికి రక్ష..

1 min read
వ్యాక్సిన్​ వేయించుకుంటున్న డిప్యూటీ సీఎం అంజాద్​బాష

వ్యాక్సిన్​ వేయించుకుంటున్న డిప్యూటీ సీఎం అంజాద్​బాష

  • డిప్యూటీ సీఎం అంజాద్​బాష
    పల్లెవెలుగు వెబ్​, కడప: కోవిడ్​ వ్యాక్సిన్​తో ఆరోగ్యానికి సురక్ష అని డిప్యూటీ సీఎం అంజాద్​బాష అన్నారు. సోమవారం రిమ్స్ హాస్పిటల్ లోని ఓపీ విభాగంలో ఉపముఖ్యమంత్రి అంజద్ బాష కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాను వేయించుకొని ప్రజల్లో భరోసా నింపారు. గత ఏడాది కోవిడ్ మహామ్మారి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలను బలిగొందన్న ఆయన.. కరోనా కాలంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య పరంగా ఎన్నో అవస్థలు పడ్డారని గుర్తు చేసుకున్నారు. ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనాను.. భారతదేశం ఎంతో చాకచక్యంగా ఎదుర్కొందన్నారు. ప్రపంచ దేశాలు భారత వైపు చూసే విధంగా మేకి ఇన్ ఇండియా లో భాగంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ను తయారు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు.
    ఆందోళన.. అసవరంలేదు..
    60 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా వేయించుకోవాలని డిప్యూటీ సీఎం అంజాద్​బాష సూచించారు. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల దీర్ఘకాలిక వ్యాధులున్నవారు కూడ కోవిడ్ టీకా చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీకా వేయించుకున్న తరువాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవన్నారు. భారతదేశంలో ఇప్పటికే కోట్ల మందికి పైగా దేశ వ్యాప్తంగా వేయించుకోవడం జరిగిందన్నారు. జిల్లా ప్రజలందరూ మరీ ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన తప్పనిసరిగా కోవిడ్ టీకా వేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రిమ్స్ సూపర్ డెంట్ డాక్టర్ ప్రసాదరావు, సి ఎస్ ఆర్ ఎమ్ వో డాక్టర్ కొండయ్య, రిమ్స్ వైద్య శాఖ సిబ్బంది, వైఎస్సార్సిపి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author