NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కోవిడ్ వ్యాక్సిన్: ఏడుగురి మృతి

1 min read

లండ‌న్: ఆక్స్ ఫ‌ర్డ్ ఆస్ట్రాజెన్కా త‌యారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఏడుగురు మృత్యువాత‌ప‌డ్డారు. ఈ విష‌యాన్ని యూకే ఔష‌ధ నియంత్రణ సంస్థ నిర్ధారించింది. మార్చి 24న 1.81 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకుంటే.. 30 మందిలో ర‌క్తం గ‌డ్డక‌ట్టే స‌మ‌స్య త‌లెత్తితే.. వారిలో 7గురు మ‌ర‌ణించినట్టు మెడిస‌న్స్ అండ్ హెల్త్ కేర్ ప్రాడక్ట్స్ రెగ్యులేట‌రీ ఏజెన్సీ వెల్లడించింది. కోట్లాది మంది వ్యాక్సిన్ తీసుకుంటే.. కొంత మందిలో ఇలాంటి దుష్ప్రభావం చూపించ‌డం సాధార‌ణ‌మ‌ని ఆ సంస్థ తెలిపింది. ఈ వ్యాక్సిన్ సుర‌క్షిత‌మ‌ని, అధికంగా యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతున్నాయ‌ని సంస్థ తెలిపింది. ఇప్పటికే ఆక్స్ ఫ‌ర్డ్ ఆస్ట్రాజెన్కా- సీర‌మ్ ఇన్స్టిట్యూట్ .. ఇండియాలో కోవిషీల్డ్ పేరుతో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాయి.

About Author