కోవిడ్ బాధితులు ఆరోగ్యంగా డిశ్చార్జ్ కావాలి
1 min read– వైద్యాధికారులకు సూచించిన ప్రభుత్వ విప్
పల్లెవెలుగు వెబ్, చిట్వేల్: కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించి.. సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి పంపాలని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యాధికారులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని ఆయన ఆకాంక్షించారు. సోమవారం చిట్వేల్ పీహెచ్సీని ఆయనతోపాటు మండల కన్వీనర్ శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. కోవిడ్ సేవలపై వైద్యాధికారి తో ఆరా తీశారు. హోమ్ ఐషోలేషన్ కిట్ల అందచేతలో అలసత్వం వహించొద్దని, పీహెచ్సీలో కోవిడ్ ఐసోలేషన్ రూము , ఆక్సిజన్ సిలెండర్లు ఏర్పాటు చేసుకొని కోవిడ్ బాధితులకు వైద్యం అందించాలన్నారు. వ్యాక్సినేషన్ పక్రియ అమలుపై ఆయన ఆరా తీశారు. కోవిడ్ నివారణ చర్యల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తోపాటు మండలకన్వీనర్ చెవ్వు శ్రీనివాసులురెడ్డి, ఎల్వీ మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు మలిశెట్టి వెంకటరమణ, ఉమామహేశ్వర్రెడ్డి, లింగం. లక్ష్మీకర్, ప్రతాప్, నవీన్, పోతయ్య, డాక్టర్ మేరి, సీఐ ఆనందరావు, ఎస్ఐ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.