PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘కోవిన్’ టీకా రిజిస్ట్రేష‌న్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: బుధ‌వారం సాయంత్రం 4 గంట‌ల నుంచి కోవిన్ వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మే 1వ తేది నుంచి రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న వాళ్లకు … వ్యాక్సిన్ వేస్తారు. ఈ మేర‌కు కేంద్ర ప్రభుత్వం మై గ‌వ‌ర్నమెంట్ ఇండియా ట్విట్టర్ ఖాతా ద్వార ఈ విష‌యం తెలియ‌జేసింది. 18 ఏళ్లు పైబ‌డిన వారంద‌రూ .. ఏప్రిల్ 28 బుధ‌వారం 4 గంట‌ల నుంచి రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు. ఆరోగ్య సేతు, ఉమాంగ్ యాప్ ల‌లో కూడ త‌మ పేరు న‌మోదుచేసుకోవ‌చ్చు. మే 1వ తేది నాటికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దం చేసిన టీకా కేంద్రాల ఆధారంగా అపాయింట్ మెంట్ దొర‌కుతుంది. 18 ఏళ్ల పైబ‌డిన వారంద‌రూ ఖ‌చ్చితంగా టీకా కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని, రిజిస్ట్రేష‌న్ కేంద్రాల వద్ద నేరుగా రిజిస్ట్రేష‌న్ చేయ‌ర‌ని కేంద్ర ప్రభుత్వం సూచించింది. రాష్ట్రాలు కొనుగోలు చేసే.. వ్యాక్సిన్ లు మాత్ర‌మే 18 ఏళ్లు పైబ‌డిన వారికి ఉప‌యోగించాల‌ని, కేంద్రం పంపిణీ చేసిన వ్యాక్సిన్లు 18 ఏళ్లు పైబ‌డిన వారికి ఉప‌యోగించాల‌ని కేంద్రం స్ప‌ష్టంచేసింది. cowin.gov.in ద్వార రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి.

About Author