PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒమిక్రాన్ పై కోవిషీల్డ్ ప‌నిచేయ‌దు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఒమైక్రాన్‌ కరోనా వేరియంట్‌పై కొవిషీల్డ్‌ టీకా ప్రభావవంతంగా పనిచేయడం లేదని పుణెలోని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌)కి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఢిల్లీకి చెందిన ఓ ఆరోగ్య కార్యకర్త (38) టీకా తీసుకోవడానికి ముందు ఒకసారి.. కొవిషీల్డ్‌ తీసుకున్న తర్వాత రెండుసార్లు కరోనా బారినపడ్డాడని శాస్త్రవేత్తలు తెలిపారు. గతంలో కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ సోకడంతో పాటు కొవిషీల్డ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నవారి రోగ నిరోధక వ్యవస్థనూ ఒమైక్రాన్‌ వేరియంట్‌ తప్పించుకోగలదని ఈ అధ్యయనంతో నిరూపితమైందని పేర్కొన్నారు. ఇటువంటి వారు కొవిడ్‌ టీకా బూస్టర్‌ డోసును తీసుకోవడం అత్యవసరం అనేందుకు ఇదొక సంకేతమని చెప్పారు.

                             

About Author