PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆవు పేడ దివ్యౌష‌ధ‌మా.. ఎందుకంత మూర్ఖత్వం..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఒక జీవి విస‌ర్జించిన వ్యర్థం.. ఇంకొక జీవికి ఔషధం ఎలా అవుతుంది?. ఆవు పేడ‌ ద్వార రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌నండం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం?. కొంత మంది ఇలాంటి విధానాల్ని అదేప‌నిగా ప్రచారం చేయ‌డం క‌రెక్టు కాద‌ని ప‌లువురు వైద్యులు చెబుతున్నారు. ఆవుపేడ‌ను వైద్య విధానంగా ఉప‌యోగించ‌డం అర్థంలేని ప‌ని అంటూ వైద్యులు పెద‌వి విరుస్తున్నారు. గుజ‌రాత్ లోని శ్రీస్వామి నారాయ‌ణ్ గురుకుల్ విశ్వవిద్యా ప్రతిష్టానంలో కొంద‌రు ఆవుపేడ చికిత్స పొందుతున్నారు. ఆవుపేడ‌, మూత్రం పూసుకుని.. ఆ త‌ర్వాత ఆవు పాల‌తో శుభ్రం చేసుకుంటున్నారు. ఆవుపేడ చికిత్స ద్వార శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని వీరి న‌మ్మకం. అయితే.. గుజరాత్ కు చెందిన వైద్యులు ఈ విధానాన్ని పూర్తీగా కొట్టిపారేస్తున్నారు. ఆవుపేడను శ‌రీరానికి పూసుకోవ‌డం వ‌ల్ల మ్యూకోమైకోసిస్ లాంటి ఫంగ‌ల్ ఇన్ఫెక్షన్లు వ‌స్తాయ‌ని వైద్యులు చెబుతున్నారు. ఒక జీవి విస‌ర్జించిన వ్యర్థం మ‌రో జీవి చికిత్సకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న నిర్ధార‌ణ ఎక్కడా జ‌ర‌గ‌లేద‌ని వైద్యులు చెబుతున్నారు.

About Author