NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆవుకు చికిత్స‌.. ఏడుగురి డాక్ట‌ర్ల‌కు డ్యూటీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఫతేపూర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అపూర్వ దుబే సాకుతున్న ఆవుకి జాగ్రత్తగా చికిత్స అందించేందుకు ఏడుగురు పశువైద్యులకు డ్యూటీ విధిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. రోజుకు ఒకరి చొప్పున వారం రోజులపాటు ఆవుకు చికిత్స అందించేందుకు వీలుగా వెటర్నరీ డాక్టర్లకు బాధ్యతలు అప్పగిస్తూ డిస్ట్రిక్ట్ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్(సీవీవో) ఎస్‌కే తివారీ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మేడం గారి ఆవుకి చికిత్స అందించే క్రమంలో సూచించిన ఏడుగురు వెటర్నరీ ఆఫీసర్లకు ఉదయం, సాయంత్రం విధులు అప్పగిస్తున్నామని పేర్కొన్నారు. అయితే వైద్యులు ఆవుకి జాగ్రత్తగా చికిత్స అందించడమే కాదు చికిత్సకు సంబంధించిన రిపోర్ట్‌ను తయారుచేయాలి. సంబంధిత వైద్యుల మధ్య సమన్వయం, చికిత్స ఫాలో-అప్‌ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలను డా.దినేష్ కుమార్ అనే డాక్టర్‌కి అప్పగిస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటలకు రిపోర్ట్‌ని ఆఫీస్‌ వద్ద సమర్పించాలని షరతు విధించారు.

                                             

About Author