ఆవుల్లోనూ అద్దె గర్భం !
1 min readపల్లెవెలుగువెబ్ : తెలంగాణలో ఆవుల్లోనూ అద్దె గర్భం విధానాన్ని తొలిసారిగా అమలు చేశారు. రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ, కోరుట్ల పశువైద్య కళాశాల సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమై.. మూడు దూడలు పుట్టాయి. ఒక ఆవుకు పెయ్య, మరో ఆవుకు కోడె కవల దూడలు జన్మించాయి. ఆవుల్లో సరోగసి ప్రయోగం విజయవంతం కావడం రాష్ట్రంలో పాడి పశువుల అభివృద్ధికి కీలక మలుపు అని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణాధికారి డాక్టర్ మంజువాణి పేర్కొన్నారు. సరోగసీ విధానంలో ఎంబ్రియోలను ఆవుల గర్భంలో ప్రవేశపెట్టాక.. ఇలా దూడలు పుట్టడం రాష్ట్రంలో ఇదే ప్రథమమని చెప్పారు. రాష్ట్రంలో పశుగణాభివృద్ధికి ఎల్డీఏ అనేక కార్యక్రమాలను చేపడుతోంది. అందులో భాగంగా సరోగసీ విధానాన్ని కూడా చేపట్టారు. ముందుగా సాహివాల్ దేశీజాతి గిత్త నుంచి సేకరించిన వీర్యాన్ని ప్రయోగశాలలో ఫలదీకరణం చేశారు. ఆ ఎంబ్రియోలను జెర్సీ ఆవు గర్భంలో ప్రవేశపెట్టగా మూడు దూడలు పుట్టాయి.