ఇళ్ల స్థల పట్టాలివ్వాలని సీపీఐ ..ఎ ఐ టి యు సి ధర్నా
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: నిరుపేదలకు ఇళ్లస్థల పట్టాలివ్వాలని సోమవారం సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలోచదలరామయ్య భవన్ నుండి ర్యాలీ చేపట్టారు.అనంతరంఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.అలాగే డిప్యూటీ తహసల్దారు గారికి వినతి పత్రం అందజేశారు.ఈ ధర్నాకార్యక్రమానికి తాలూకా అధ్యక్షులు బి నెట్టేకంటయ్య అధ్యక్షతన జరిగినఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం నబిరసుల్, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఎన్ కృష్ణయ్య ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి ఎం రంగన్న లు మాట్లాడుతూ,నిరుపేదలు భూ పోరాటం చేసి ఆక్రమించుకున్న కర్నూల్ రోడ్డు లోని నల్లగుట్ట కొండ ప్రాంతంలో సర్వే నెంబర్699 లో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రభుత్వం నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు . స్థానిక ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు, కార్మికులతో భారీ ర్యాలీ చేపట్టి స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ముందు సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేసి, అనంతరం డిప్యూటీ తాసిల్దారు గారికి వినతి పత్రంఇవ్వడమైనదిభూ కబ్జాలకుపాల్పడేనాయకులకు రెవెన్యూ అధికారులు దాసోహం అయ్యారని ఇళ్ల స్థలాలు లేని నిరుపేదల పక్షాన సిపిఐ, ఏఐటీయూసీ నాయకత్వాన ఎల్లవేళలా అండగా ఉంటూ వారికి ఇళ్ల పట్టాలు ఇప్పించి న్యాయం చేసేంతవరకు పోరాడుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఎన్ రామాంజనేయులు సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం కారన్న సుల్తాన్ ఏఐటియుసి తాలూకా గౌరవ అధ్యక్షులు మాదన్న ఉపాధ్యక్షులు రాజప్ప రామచంద్ర, ఏఐటీయూసీ తాలూకా డిప్యూటీ కార్యదర్శి గుండు బాషా ఏఐటియుసి నాయకులు విజయ్ ,సంజన ,సంజీవ రాయుడు,పెరవలి రంగన్న, ఉచ్చురప్ప ,నాగేష్ తదితరులు పాల్గొన్నారు.