పంట నష్ట పరిహారం చెల్లించాలని సిపిఐ ధర్నా
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ : సిపిఐ కర్నూలు జిల్లా సమితి పిలుపుమేరకు పత్తికొండలో రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ, సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక నాలుగు స్తంభాల కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి రాజా సాహెబ్ మాట్లాడుతూ, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 40,000 రైతు ఖాతాలో జమ చేయాలని నినాదాలు చేస్తూ అరగంటసేపు కూడలిలో ఆందోళన చేశారు.పంట నష్టపోయిన రైతుకు నెలలోపే నష్ట పరిహారం ఇస్తామన్న జగన్ మాట తప్పి ఇప్పటివరకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదన్నారు.ఉల్లి,మిర్చి రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు.ఇచ్చిన మాట ప్రకారంగా పంట నష్టపరిహారం నెలలోపే ఇవ్వలేని జగన్ ఇప్పటికైనా పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితుల్లో గ్రామాల్లో ప్రజలకు త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.జిల్లాలో తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలన్నారు.పంట నష్టపోయి 6 నెలలైనా నష్టపరిహారం ఇవ్వని Y.S. జగన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కార్యకర్తలను నినాదాలు చేశారు.పంట నష్టపోయి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవాలని కోరారు.రైతు వ్యతిరేకి C.M.జగన్ రెడ్డి డౌన్ డౌన్..CPI అంటూ చదువు రామయ్య భవనం నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన అనంతరం నాలుగు స్తంభాల కూడలి వద్ద ధర్నా నిర్వహించి, స్థానిక తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కారుమంచి, గురుదాస్, నెట్టికంటయ్య, పెద్ద వీరన్న తదితరులు పాల్గొన్నారు.