స్థానికేతర అభ్యర్థులకు సీపీఐ వ్యతిరేకం
1 min readస్థానిక నేతలనే అభ్యర్థులుగా ప్రకటిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది.
స్థానికేతరులు అంటే వ్యక్తుల అభివృద్ధి చెందడమే.
నియోజవర్గంలో కనీసం సమస్యలపై అవగాహన లేని వ్యక్తులు అభ్యర్థులంటే ఎలా..?
అవసరమైతే సిపిఐ బరిలో నిలుస్తుంది.
అలగనూరు రిజర్వాయర్ సమస్య పాలకుల వైఫల్యమే.
సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రానున్న సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇరు పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక విషయంలో స్థానికుల ను మరిచి స్థానికేతర్లను దిగుమతి చేసుకోవడములో మతలబు ఏమిటో ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం స్థానిక నియోజకవర్గ నేతలకు ఉందని, నియోజవర్గ అభివృద్ధి దృష్ట్యా అలాంటి ఆలోచన విరమించుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు సూచించారు. శుక్రవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో పట్టణ కమిటీ సభ్యుల ఎన్నిక కార్యక్రమాన్ని సిపిఐ జిల్లా నాయకులు రఘురామమూర్తి, రమేష్ బాబుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగ నాయుడు హాజరయ్యారు.అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ వైసిపి పాలనలో ప్రజా, మరియు రైతన్నల సంక్షేమము పాలకుల నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే అలగనూరు రిజర్వాయర్ సమస్య పరిష్కారానికి నోచుకోలేదని దీంతో పరివాహక ప్రాంతాల చెందిన పలు మండలాల రైతులు తమ పంటలు పండించుకోలేని స్థితిలో ఉన్న కరువు మండలాలుగా ప్రకటించి ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు..శ్రీశైలం నీటిమునక నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కేసులు భరించి 98జిఓ అమలు కై ఉద్యమ బాటతో న్యాయం కై ఎదురు చుస్తున్నారని, కృష్ణా నది జలాలు ఈ ప్రాంతానికి అందనంత దూరం లో ఉండి బీడు భూములుగా నందికొట్కూరు ప్రాంతం ఉందని,జూపాడుబంగ్లాలో ఉన్నటువంటి తంగేడంచ ఫారం 1600 ఎకరాల ప్రభుత్వ భూములు అడవిని తలపిస్తున్నాయని అభివృద్ధి చేయడంలో పాలకులు విఫలం చెందారన్నారు.. నందికొట్కూరు నియోజవర్గం వర్గ పోరుతో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయిందని కేవలం నియోజవర్గంలో ఎంపికయ్యాయే ఎమ్మెల్యేలు డమ్మీలుగా నిలిచిపోయే పరిస్థితి ఉండడం సిగ్గుచేటు అన్నారు. పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ కల్పించాలని, అభివృద్ధి చేకూరేలా తోడ్పాటును అందించే పరిస్థితి ఉండాలని ఆయన సూచించారు. సమస్యలపై అవగాహన కలిగిన స్థానికులకు అవకాశం ఇవ్వకుండా ఇతర జిల్లాల నుంచి పార్టీ అభ్యర్థులుగా దిగుమతి చేసుకోవాలన్న ఆలోచన చేయడం ఇది సబబు కాదని వారు హెచ్చరించారు. పార్టీ అధినాయకత్వాలు ఆలోచన చేయాలని అలాంటి వ్యక్తుల చేత నియోజవర్గ అభివృద్ధి ఎలా సాధ్యమంటూ వారు ప్రశ్నించారు. ఇప్పటికే నియోజవర్గంలో స్థానికేతర్లు పార్టీ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారన్న ప్రచారం కొనసాగుతుందని, ఆ క్రమంలోనే ఆ పార్టీలోనే పూర్తి వ్యతిరేకత కూడా పెరుగుతుందన్న ఆలోచన గమనించాలని కోరారు. నియోజవర్గ ప్రజల ఆకాంక్ష నెరవేర్చి అభ్యర్థి కావాలి తప్ప స్వార్థ ప్రయోజనాలకు వచ్చే అభ్యర్థులు కాదని అలాంటి పరిస్థితి వస్తే సిపిఐ పార్టీ తమ వ్యక్తిని బరిలో నిలుపుతామని వారు హెచ్చరించారు. స్థానికేతర్లకు వ్యతిరేకంగా గద్దెదించేందుకు సిపిఐ వెనకాడ బోధన్నారు..
సీపీఐ పట్టణ కార్యదర్శిగాఎం శ్రీనివాసులు ఏకగ్రీవ ఎన్నిక..
అనంతరం నిరంతరం విద్యార్థి యువజన విభాగాలలో ఉద్యమాలు చేసి పట్టణ ప్రజల సమస్యలపై అవగాహన కలిగిన విద్యార్థి సంఘ రాష్ట్ర నాయకులు ఎం.శ్రీనివాసులు ను సీపీఐ నందికొట్కూరు పట్టణ కార్యదర్శిగా ఎంపిక చేసినట్లు జిల్లా కార్యదర్శి రంగనాయుడు వెల్లడించారు.శ్రీనివాస్లు ఎంపిక పట్ల సిపిఐ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నాయకురాలు రజిత, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహా కార్యదర్శి మహానంది, సురేంద్ర,దినేష్ మరియు నూతన పట్టణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.