మిజోరం గవర్నర్ పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
1 min readపల్లెవెలుగు వెబ్ : మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం పై కంభంపాటి హరిబాబుకు ప్రేమ ఉంటే.. మిజోరం గవర్నర్ గా వెళ్లనని చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉంటేనే వెళ్తానని.. లేకుంటే వెళ్లనని చెప్పాలని కోరారు. విశాఖలో పుట్టి పెరిగిన ఆయన.. విశాఖ స్మశానంగా మారుతుంటే మిజోరం గవర్నర్ గా ఎలా వెళ్తారని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో వైసీపీ ముద్దాయిగా నిలబడనుందని నారాయణ అన్నారు. విశాఖలో కీలకంగా ఉన్న బీజేపీ నేతలు స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు పోరాడటంలేదని ప్రశ్నించారు.