గవర్నర్ వ్యవస్థ పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు !
1 min read
పల్లెవెలుగువెబ్ : గవర్నర్ వ్యవస్థపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గవర్నర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. గవర్నర్ వ్యవస్థకు కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకమని తెలిపారు. తమకు గిట్టని రాష్ట్రాలపై గవర్నర్‌లతో కేంద్రం పెత్తనం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నారాయణ పిలుపునిచ్చారు.