PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడ్కో గృహాలను సందర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి

1 min read

– కామ్రేడ్ కె రామకృష్ణ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగర శివారులోని గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కోగృహాలను ఆదివారం నాడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హాయంలో పేద ప్రజల సొంతింటి కల నెరవేరే విధంగా పేద ప్రజల నుండి 20,000 50,000 లక్ష రూపాయలు డిపాజిట్లు తీసుకొని టిడ్కో గృహాలను నిర్మిస్తే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక రూపాయి తీసుకోకుండా లబ్ధిదారులందరికీ టిడ్కో గృహాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టి నాలుగు సంవత్సరాలు గడుస్తా ఉన్న ఒకరికి కూడా ఇండ్లకు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు కర్నూల్ నగరంలో 100400.టిడ్కో గృహాలే కాకుండా మరొక పదివేల ఇందిరమ్మ గృహాలు మౌలిక వసతులు లేక లబ్ధిదారులకు అందించలేకపోయారని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ వైపున ఆలోచించి ఉంటే ఈరోజు కర్నూల్ నగరంలో 20వేల మంది పేద ప్రజలకు గృహాలు వసతి కలిగి ఉండేదని అయితే ప్రభుత్వ అనాలోచితం నిర్ణయాల వల్ల నాలుగేళ్ల నుంచి ఇంకా రంగులు వేసే దగ్గరే ఆగిపోయారని ఆయన విమర్శించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి టిడ్కో లబ్ధిదారులకు అందించాలని అదేవిధంగా జగనన్న కాలనీ లబ్ధిదారులకి గృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 1,80,000 బేస్మెట్ నిర్మించుకోవడానికి సరిపోదని కావున లబ్ధిదారులకి గృహ నిర్మాణాల కోసం ఐదు లక్షలు ఇవ్వడంతో పాటు ఇసుక సిమెంటు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే సప్లై చేయాలని అదేవిధంగా జగనన్న కాలనీలో పేద ప్రజలకు ఇస్తున్న ఇంటి స్థలాలు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇచ్చి పేద ప్రజలు కూడా గౌరవంగా ఇల్లు నిర్మించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశాడు రాష్ట్ర ప్రభుత్వం పేదల గృహ నిర్మాణాల పట్ల చిత్తశుద్ధి లేదని ఆయన మండిపడ్డారు అందుకు నిదర్శనం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికను పార్లమెంట్ సాక్షిగా కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆంధ్ర ప్రదేశ్ లో కేవలం ఐదు ఇల్లు మాత్రమే నిర్మించాలని చెప్పడం జరిగిందన కావున పేదల ప్రజల సొంతింటి కల నెరవేర్చడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉద్యమం సాగించడానికి సిపిఐ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయని ఈనెల 30వ తేదీన ఎమ్మార్వోలకి ఆర్డీవోలకు వినతి పత్రాలు ఇవ్వడం ఫిబ్రవరి 6వ తేదీన 26 జిల్లాల కలెక్టర్ కార్యాలయాల దగ్గర వేలాదిమంది లబ్ధిదారులతో ధర్నా నిర్వహించడం జరుగుతుందని అప్పటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఫిబ్రవరి 22వ తేదీన విజయవాడలో మహాధర్న నిర్వహించడం జరుగుతుందని ఈ మహాధర్నలో టిడ్కో గృహాలు లబ్ధిదారులు సిపిఐ శ్రేణులు ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బికేఎంయు రాష్ట్ర కార్యదర్శి ఏ శేఖర్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ఎన్ రసూల్ ,నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి ,ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి , సిపిఐ కర్నూల్ నగర సహాయ కార్యదర్శిలు మహేష్, శ్రీనివాసరావు ,ఏఐటియుసి కర్నూల్ నగర అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్ ,చంద్రశేఖర్ ,రామంజి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి నాగరాజు ,ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు, కారుమంచి ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమన్న, శ్రీరాములు, జిల్లా ఉపాధ్యక్షులు శరత్, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు గిడ్డమ్మ, రహమాన్ ,ఖాజా హుస్సేన్ రహమతుల్లా, బాబయ్య, రామాంజనేయులు ,రేణుక సుధా, అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

About Author