జూలై 26 నుండి 31 వరకు సిపిఎం మహా పాదయాత్ర
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధికై జూలై 26 నుండి 31 వరకు ఆదోని నుండి కర్నూలు వరకు వందలాది మందితో సిపిఎం మహా పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గంలోని వేదావతి,నగరడోణ రిజర్వాయర్లు నిర్మాణం పూర్తిచేసి రైతులకు సాగునీరు, తాగునీరు అందించాలని. పరిశ్రమలు ఏర్పాటుచేసి యువతకు ఉపాధి కల్పించాలని. ఈ ప్రాంతం జులై 16 నుండి 19వ తేదీ వరకు జీపు జాతా కొనసాగుతుంది. సీపీఎం మండల కార్యదర్శి వెంకటేష్ అధ్యక్షతన ముఖ్య అతిథి లుగా సీపీఎం సీనియర్ నాయకులు kp నారాయణ స్వామి సీపీఎం పార్టీ ఆలూరుమండల కార్యదర్శి షాకిర్ సీపీఎం పార్టీ నాయకులు మైన నాగరాజు నాయకులు మాట్లాడుతూ హోళగుంద మండలంలో ప్రభుత్వ వైద్యశాలను 50 పడకల హాస్పిటల్ మార్చాలి. డాణపురం నుండి హోళగుంద వరకు మరియు గుళ్యం,సిద్దపురం,బళ్లురు,కోగిలతోట మీదుగా హోళగుంద వరకు రోడ్డు వేయాలి. పెద్దహ్యట,సమ్మగేరి గ్రామాలకు నిలపివేసిన రోడ్డు పనులను వెంటనే చేపట్టాలి. హోళగుంద మండల కేంద్రంలో వాల్మీకి సర్కిల్ నుండి బస్టాండు వరకు సీసీ రోడ్లు వేయాలి. ZPHS దగ్గర వాటర్ ట్యాంక్ ను నిర్మించాలి. మోడల్ స్కూల్ ఏర్పాటుకై *26న ప్రారంభమై మహా పాదయాత్రలో మరియు 31వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే మహా ధర్నాకు హోళగుంద మండలం నుండి వేలాది మంది తరలిరావాలని ప్రజలకు తెలియజేయడం జరిగింది.