సెప్టెంబర్ 1న సీపీఎస్ నిరసన ర్యాలీ..
1 min read– బహిరంగ సభ పోస్టర్ విడుదల చేసిన FAPTO నాయకులు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : ఉపాధ్యాయుల డిమాండ్ల సాధన కోసం… సెప్టెంబరు 1న భారీగా నిరసన ర్యాలీ తెలుపనున్నారు ఫ్యాప్టో సభ్యులు. ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో సెప్టెంబరు 1న సీపీఎస్ నిరసన ర్యాలీ చేపట్టనున్నారు. ఈ మేరకు శనివారం కర్నూలులోని సీ క్యాంప్ ప్రభుత్వ డ్రైవర్స్ మీటింగ్ హాల్లో బహిరంగ పోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమానికి APJAC సెక్రటరీ జనరల్ జి హృదయ రాజు మరియు యూటీఫ్ రాష్ట్ర నాయకులు సురేష్ మరియు BTA రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా FAPTO చైర్మన్ సుధాకర్, సెక్రటరీ జనరల్ రంగన్న, గోకారి STU,నారాయణ HMA, గట్టు తిమ్మప్ప DTF, UTF మహిళ నాయకులు నాగమణి , ఎల్లప్ప UTF,మునగాల మధు సుధన్ రెడ్డి APPTA మరియు సభ్య సంఘాల సభ్యులు పాల్గొన్నారు . నాయకులు అందరూ సంయుక్తంగా జిల్లాలోని ఉపాద్యాయులు అందరూ అధిక సంఖ్యలో నిరసన కార్యక్రమంలో పాల్గొని, ప్రభుత్వం నకు సి పి ఎస్ పై ఉన్న వ్యతిరేకత ను చాటి చెప్పాలని పిలుపు ఇచ్చారు.