PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమ్మవారికి ఊయల సేవ

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: లోకకల్యాణం కోసం దేవస్థానం శుక్రవారం సాయంకాలం శ్రీస్వామి అమ్మవార్లకు ఊయలసేవ నిర్వహించారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. ఆ తరువాత మహాగణపతి పూజ అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ చేశారు. ఆ తరువాత అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్రనామపూజలు, స్వామివారికి సహస్రనామార్చన జరిపించబడుతాయి. చివరగా ఊయలసేవ నిర్వహించబడుతుంది. ఊయలసేవను పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్లకు అర్చకులు పుష్పాలంకరణ; పుష్పార్చన తదితర పూజలు చేశారు.

About Author