NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భ్రమరాంబ దేవి అమ్మవారికి ఊయల సేవ

1 min read

పల్లెవెలుగు వెబ్​: లోకకళ్యాణార్థం పౌర్ణమిని పురస్కరించుకుని దేవస్థానం  శ్రీస్వామిఅమ్మవార్లకు ఊయలసేవను నిర్వహించారు ప్రతి శుక్రవారం రోజు మరియు పౌర్ణమి, మూలనక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ దేవస్థానం జరిపించబడుతోంది పౌర్ణమి రోజున లక్షకుంకుమార్చన అనంతరం ఊయలసేవను నిర్వహించారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ నిర్వహించారు. అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ జరిపించబడుతాయి. తరువాత  ఊయలసేవను పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు అలంకరణ చేశారు ఈ కార్యక్రమంలో ఈవో లవన్న పాల్గొన్నారు.

About Author