NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు కల్పన

1 min read

6 నెలలో  ఇంటిగ్రేటెడ్ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం

రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి వర్యులు టీజీ భరత్

కర్నూలు, న్యూస్​ నేడు: 6 నెలలో  ఇంటిగ్రేటెడ్ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు అని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి వర్యులు టీజీ భరత్ తెలిపారు.శుక్రవారం పత్తికొండ మండలం, దూదేకొండ రెవెన్యూ గ్రామం, కోతిరాళ్ళ గ్రామ పంచాయతీ వద్ద రూ.11 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్  టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కు రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి వర్యులు భూమి పూజ నిర్వహించి శిలాఫలకం ఆవిష్కరించారు…ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కర్నూలు ఎంపీ, పత్తికొండ ఎంఎల్ఏ  ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి  కోరగా వెంటనే అందుకు సంబంధించిన పనులు చేయాలని ముఖ్యమంత్రి వర్యులు  ఆదేశించడం జరిగిందన్నారు….  ఆ మేరకు ఈ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు  చేస్తున్నామన్నారు.. ఈ ప్రాజెక్టు ఏర్పాటు కొరకు నిధులు పుష్కలంగా ఉన్నాయని.. ఈ ప్రాజెక్టు ఏర్పాటు 6 నెలలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఏపి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ, కాంట్రాక్టర్ లను ఆదేశించారు..  యూనిట్ స్థాపన త్వరగా ఐపోతే  ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వర్యులు గారు విచ్చేసే అవకాశాలు ఉన్నాయన్నారు.ఈ ప్రాజెక్టు  స్థాపనకు 11 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు… ఈ ప్రాజెక్టు ద్వారా  32 మందికి ప్రత్యక్ష ఉపాధి, 100 మందికి పరోక్ష ఉపాధి కల్పన ఉంటుందన్నారు..టొమాటో కెచప్, టొమాటో పేస్ట్, టొమాటో పికిల్ లాంటి ఉత్పత్తులు తయారు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఏ రకమైన బాటిల్ లో అయినా కెచప్ ఒకటే రకంగా ఉంటుందని ఇక్కడ టొమాటో పంట పండించే రైతులతో మాట్లాడి ప్రత్యేకమైన జిన్ తో టొమాటో పంట పండిస్తే అదే రకమైన కెచప్ లాగా ఉండడంతో పాటు నాణ్యత కూడా ఉండడంతో సేల్ చేసుకునే దానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు..  టొమాటో పంటలు పండించే రైతులకి అటువంటి విషయాల గురించి వారిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు… టొమాటో పల్ప్ చేసినట్లయితే రోజు 10 నుండి 15 మెట్రిక్ టన్నులు చేయవచ్చునన్నారు.. డీహైడ్రేషన్ కి ఐతే రోజు 5 మెట్రిక్ టన్నులు చేయవచ్చునన్నారు.. ఒకవేళ టొమాటో పంట లేని పక్షంలో మామిడి, బనానా, పప్పయ్య, జామ పండ్లను ప్రాసెస్ చేసుకోవచ్చునన్నారు.. జిల్లాలో పత్తికొండ మండలంలో టొమాటో పంట సాగు చాలా ఎక్కువగా ఉంటుందన్నారు.. ఈ యూనిట్ ఏర్పడిన తర్వాత టొమాటో లు రోడ్ల మీద పడేసే పరిస్థితి ఎక్కడ ఉండదన్నారు… ఈ యూనిట్ ద్వారా ఇన్కమ్ ఎక్కువ జెనరేట్ అవ్తే ప్రైవేట్ వారు కూడా చాలా మందికి యూనిట్ లు పెట్టేందుకు ముందుకు వస్తారన్నారు.. అదే విధంగా తుగ్గలి, దేవనకొండ, క్రిష్ణగిరి, ఆదోని, గొనేగండ్ల, ఆస్పరి, ఆలూరు ప్రాంతాల వారికి ఈ యూనిట్ చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుందన్నారు… ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కి సంబంధించి కేంద్ర, రాష్ట్రంలో చాలా మేరకు రాయితీలు ఉన్నాయన్నారు.. ఫుడ్ ప్రాసెసింగ్ అంశం పై రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సమీక్ష నిర్వహించిన సమయంలో ఈ 5 ఏళ్లలో 30 వేల కోట్ల పెట్టుబడులు పరిశ్రమల నుండి  రావాలని ముఖ్యమంత్రి  ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అందుకు అనుగుణంగా పని చేస్తున్నామన్నారు.. దుబాయి కి వెళ్ళిన సమయంలో ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించి చాలా మంది పారిశ్రామిక వేత్తలను కలవడం జరిగిందన్నారు.. వారిని కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని రిక్వెస్ట్ చేయడం జరిగిందన్నారు.. ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించిన వాటిలో ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువ స్థాయిలో వచ్చే అవకాశం ఉందన్నారు.. 2014 నుండి 2019 సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు… ఆ ఇండస్ట్రియల్ ప్లాంట్ లో స్టీల్ ప్లాంట్ కూడా వచ్చే నెల 19 వ తేది  ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.. వలసలు నివారించి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ లో చాలా మేరకు పెద్ద ఎత్తున్న పరిశ్రమలు రానునయన్నారు.. విద్యార్థులకు చదువుతో పాటు స్కిల్ కూడా అవసరమన్నారు…భారతదేశంలో ఏ రాష్ట్రం లోనూ ఇవ్వని విధంగా పెన్షన్ మొత్తాన్ని మన రాష్ట్రంలో ఇస్తున్నామన్నారు… వైజాగ్ లో  కూడా ఎన్నో దిగ్గజ ఐటి కంపెనీ లు రానున్నాయన్నాని మంత్రి పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ  టమాటో పండించే రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఈ టొమాటో ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు ను 11 కోట్ల రూపాయలతో తీసుకొని రావడం జరిగిందన్నారు… రాష్ట్రంలో టమోటో పంట లక్ష 20 వేల ఎకరాలలో పంట సాగు చేస్తే 7 వేల 900 హెక్టార్ల పంట మన జిల్లాలో సాగు అవుతుందని అందులో కూడా 30 నుండి 40 శాతం పంట సాగు పత్తికొండ లో అవుతుందన్నారు.. రేట్ ఉన్నపుడు మార్కెట్ లో అమ్ముకున్నప్పటికీ, మిగతా రోజులలో వాటిని ప్రాసెసింగ్ చేసి వివిధ రకాల ఫార్మాట్ లకు మార్చి వాటిని మార్కెటింగ్ చేసేందుకు వీలుగా ఈ యూనిట్ ను ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు… వీటి ద్వారా రైతులకు ఉపయోగపడుతుందన్నారు.. వీటి ద్వారా ప్రత్యక్షంగా 32 మంది పరోక్షంగా 100 మంది కి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు… ఏ విధమైన ప్రొడక్ట్స్ ద్వారా లాభాలు వస్తాయనే అంశం మీద కూడా రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.. టొమాటో నే కాకుండా వీటితో పాటు బొప్పాయి, అరటి, జమ లాంటి పండ్లను కూడా ప్రాసెసింగ్ చేసుకోవచ్చునన్నారు… జిల్లాలో అనేక రకాల యూనిట్ లను తీసుకొని రావాలని కలెక్టర్ మంత్రిని కోరారు..పత్తికొండ శాసనసభ్యులు కే ఈ శ్యాంబాబు మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా టమోటా పంటను సాగు చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి టమోటా కు గిట్టుబాటు ధర కూడా లేకుండా రేటు పూర్తిగా పడిపోవడం చేత రైతు చాలా నష్టపోతున్నారు, ఇది దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు పత్తికొండ నియోజకవర్గంలోని దూదేయకొండ రెవెన్యూ గ్రామ పరిధిలో  11 కోట్ల రూపాయలతో ఈ యూనిట్ నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా ఈ యూనిట్ను 6 లేక 7 నెలలు పూర్తి చేస్తామని మంత్రి తెలియజేయడం చాలా సంతోషమన్నారు. ఈ టమోటా ప్రాసెసింగ్ యూనిట్ లో  టమోటోలు మాత్రమే కాకుండా, వివిధ రకాల పండ్లను కూడా ప్రాసెసింగ్ చేయవచ్చునని అన్నారు, ఈ ప్రాంత రైతులు నాణ్యత కలిగిన టమోటాలను పండించాలన్నారు, ఈ ప్రాంత రైతులకు ఏ పంటను పండిస్తే ఈ యూనిట్ కు పనికి వస్తుందో దాని పైప్రభుత్వం రైతులకు శిక్షణ కూడా శిక్షణ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంత రైతులందరూ వ్యవసాయపరంగా బాగుపడాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో పందికోన కుడి కాలువ ద్వారా  దేవనకొండ మండలంలో మంచి పంటలు పండిస్తున్నారు. ఎడమ కాలువ నుండి కూడ  నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు…ఏపి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ డా.గెడ్డం శేఖర్ బాబు మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ లలో ఎక్కువ గ్రాంట్ మొత్తంతో 11 కోట్ల రూపాయలతో ఈ జిల్లాలో టొమాటో ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ ఉందన్నారు.. ప్రాజెక్టు కి సంబంధించిన నిర్మాణం కూడా 6 నెలలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు..కార్యక్రమంలో వాల్మీకి సంఘం చైర్మన్ బొజ్జమ్మ, పత్తికొండ ఆర్డీఓ భరత్, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, తుగ్గలి నాగేంద్ర  తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *