PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా వ్యాప్తంగా వేసవి కాలం లో నేరాల అదుపు నివారణ చర్యలు

1 min read

ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి, ఐ.పి.ఎస్  ఆదేశాలతో

జిల్లావ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు

వేసవి దృశ్య ప్రజలు అప్రమత్తంగా ఉండి పలు సూచనలు పాటించాలి

క్రైమ్ పోలీస్ స్టేషన్ నెంబర్ 08812 223318 తెలపాలి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : సి.హెచ్ మురళి కృష్ణ సి.ఐ, సెంట్రల్ క్రైమ్ స్టేషన్, ఏలూరు వారి  ఈ క్రింది ముఖ్య సూచనలు  తెలియచేయడం జరిగింది. డాబాలపై పడుకొనే సమయాలలో మీ ఇంటి తలుపులను లాక్ చేయలని,  అన్లాక్ చేయబడిన తలుపులు చొరబాటుదారులకు బహిరంగ ఆహ్వానాలుగా ఉండకూడదన్నరు. అందరు ఒకే ఏ.సి రూంలో పడుకోవడం, సెలవులకు బయటకు వెళ్లడం వంటి సమయాలలో ఇంట్లో ఉండే విలువైన వస్తువులు లాకర్లు లో భద్రపర్చుకోవాన్నరు. అపార్ట్మెంట్ నివాసాలలో వాచ్ మెన్ తప్పనిసరిగా పెట్టుకోవాలి, కొత్త వ్యక్తులు, అనుమానితులు  వచ్చిన వెంటనే వారి సమాచారం దగ్గరలో గల పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలి, సీసీ కెమెరా లను విధి గా మెయింటెనెన్స్  చేయాలని. ఐ.పి.ల్ క్రికెట్ జరుగుతున్నందువల్ల, బెట్టింగ్ జోరులో యువత నేరాలకు పాల్పడుతున్నారు కాబట్టి   మహిళలు బయటకు వెళ్లే సమయాలలో ధరించిన వస్తువులు మరియు బ్యాగ్ లు జాగ్రత్తగా ఉండాలన్నరు, చైన్ స్నాచింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని. రద్దీ ప్రాంతాలు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, రైతు బజార్లు,షాపింగ్ మాల్స్ బ్యాంకుల వద్ద అటెన్షన్ డైవర్ట్ గ్యాంగ్  ఫోన్స్ దొంగతనాలు పాల్పడుతున్నారు. కావున తగిన జాగ్రత్త వహించాలన్నరు.   ద్విచక్ర వాహనాలును ఇంటి బయట పార్కు చేసి, ఇంటిలో ఉన్న సందర్భంలో  వాహనాలు దొంగతనాలు జరుగుతున్నాయి, కావున బయట పార్క్ చేసిన వాహనాలకు అలారం మరియు డబల్ లాక్ ఏర్పాటు చేసుకోని భద్రపరచుకొనవలెను.  రహదార్లు వెంబడి అపరిచిత వ్యక్తులు లిఫ్ట్ అడిగి నేరాలుకు పాల్పడుతున్నారు. ఇంటివంటి సందర్భాలలో వాహనదార్లు జాగ్రత్తగా ఉండాలన్నరు. మహిళలు ఆటో ప్రయాణాలు చేస్తున్నప్పుడు తోటి అనుమానిత మహిళా ప్రయాణానికుల యెడల జాగ్రత్తగా ఉండి. తమ హ్యాండ్ బాగ్ లలో విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవలని. మీరు  మీ ఇంటిని విడిచి బయటకు లేదా వూరు వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని. ఆలయాలు, చర్చి, మసీదులు మరియు ఇతర మత సంబధిత సంస్థల వద్ద ఏర్పాటు చేసిన హుండీ,  డిబ్బీలలో భక్తులు సమర్పించిన కానుకలు కుడా దొంగతనములు జరుగుతున్నాయి, కావున ఆలయ కమిటీ వారు హుండీ కానుకలు త్వరగా లెక్కించి డిపాజిట్ చేసుకోవాలన్నరు, మరియు సీసీ.టీవీ లు ఏర్పాటు చేసుకోవాలి. వేసవి సెలవులు పై వెళ్లే సందర్భాల్లో LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం కొరకు అప్ ద్వారా  అభ్యర్థించిన 24 గంటల్లో పోలీసులు ఇంటికి చేరుకుని కెమెరాను ఫిక్స్ చేస్తారన్నరు. తద్వారా నేరాలు అదుపు చేయవచ్చుని. ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి వారు అన్ని నివారణ చర్యలు తీసుకోవడం జరిగింది. కావున సాధారణ ప్రజలoదరు పోలీసువారికి సహకరించి ఈ వేసవిలో నేరాల అదుపు కు తమవంతు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  ఏదైనా ముఖ్య సమాచారం కొరకు దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ లేదా 08812-223318 (క్రైమ్ పోలీస్ స్టేషన్) ఏలూరువారికి తెలియచేయాలనాని సూచించారు.

About Author