NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేర నివారణే ప్రథమ కర్తవ్యంగా బాగా పని చేయాలి… జిల్లా ఎస్పి

1 min read

విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు

పెండింగ్ కేసులు తగ్గించాలి 

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి భాద్యత.

సైబర్ నేరాల బారిన పడకుండా  ప్రజలకు అవగాహన కల్పించాలి.

పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన … జిల్లా ఎస్పీ.

కర్నూలు, న్యూస్​ నేడు:  విధులలో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపియస్  తెలిపారు. ఈ సంధర్బంగా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని  వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని  డిఎస్పీలు,  సిఐలు, ఎస్సైల తో కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపియస్  నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.  పోలీసు అధికారులతో  మాట్లాడారు.  కర్నూలు , పత్తికొండ , ఆదోని , ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లో  దీర్ఘకాలంగా ఉన్న  పెండింగ్‌ కేసుల  గురించి  జిల్లా ఎస్పీ   సమీక్షించి ఆరా తీశారు.పోలీసుస్టేషన్ల వారీగా కేసుల పెండింగ్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పలు సలహాలు,  సూచనలు చేశారు. డాభాల్లో మద్యం, ఒపెన్ డ్రింకింగ్, పేకాట వంటి అసాంఘిక కార్యకలపాల పై గట్టి చర్యలు చేపట్టాలన్నారు.  అసాంఘిక కార్యకలపాలను ప్రోత్సహిస్తే ఎస్పీ  స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగి దాడులు చేస్తాయన్నారు. పెండింగ్ కేసులు తగ్గించాలన్నారు. మెజిస్ట్రేట్ లను కలిసి పెండింగ్ కేసుల పరిష్కారానికి  కృషి చేయాలన్నారు.పెండింగ్ కేసులలో  ముద్దాయిల అరెస్టు గురించి ఆరా తీశారు. ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా భాదితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.    కేసుల దర్యాప్తుల పై డిస్పీ స్ధాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా హైవే పెట్రోలింగ్ పోలీసులు బాగా  పని చేయాలన్నారు.  పోలీసు అధికారులు గ్రామాల పర్యటనకు వెళ్ళినప్పుడు రోడ్డు ప్రమాదాల మలుపులు, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి  రేడియం స్టిక్కర్స్, బారికేడ్స్, బ్లింకర్స్, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఒక్కరి ప్రాణం కాపాడినా వారి కుటుంబాన్ని కాపాడటమేనన్నారు.ప్రమాదాలు, చర్యలు, అధికారులు,సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు  అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇన్వెస్ట్మెమెంట్ ఫ్రాడ్స్, ఓటిపి ఫ్రాడ్స్ పలు రకాల సైబర్ మోసాలతో   ప్రతి రోజు కు  రాష్ట్ర వ్యాప్తంగా   కోటి రూపాయల వరకు ప్రజలు సైబర్ నేరాల బారిన పడి నష్టపోతున్నారన్నారు.డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీలుచేపట్టాలన్నారు. మిస్సింగ్ కేసులను చేధించాలన్నారు.అనంతరం గత నెలలో వివిధ కేసులలో  ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులు, పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారుఈ నేర సమీక్షా సమావేశంలో   డిఎస్పీలు  బాబు ప్రసాద్,  ఉపేంద్రబాబు , హేమలత , ఏ ఆర్ డి ఎస్ పి భాస్కర్ రావు , సిఐలు , ఎస్సైలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *