PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేర సమీక్ష సమావేశం .. జిల్లా ఎస్పీ

1 min read

పల్లెవెలుగు, వెబ్​ నంద్యాల: నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల పోలీస్ కార్యాలయంలో “నంద్యాల, డోన్” సబ్ డివిజన్ కు సంబంధించి నేర సమీక్ష సమావేశం నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి IPS గారు నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశంలో పెండింగ్ లో వున్నకేసుల విచారణ వేగవంతం చెయ్యాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రతి స్టేషన్ పరిధిలో 2020 వ సంవత్సరంకు ముందు నమోదై ఇంకా విచారణ కొనసాగుతున్న కేసుల ఫైల్స్ ను అడిగి తెలుసుకుని కేసు దర్యాప్తు సాగిన విదానాన్ని క్షుణ్ణముగా అడిగి తెలుకొని , కేసు దర్యాప్తు ముందుకు సాగడానికి దర్యాప్తు అధికారికి పలు మెళుకువలను సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో వున్నా కేసుల విచారణ వేగవంతం చెయ్యాలని అధికారులను ఆదేశించారు.బీట్ వ్యవస్థను పటిష్టం చెయ్యాలన్నారు. రాత్రి సమయాలలో గస్తీ నిర్వహించే పోలీస్ అధికారుల వాహనాలకు సైరన్ తప్పనిసరిగా ఉండాలన్నారు. రాత్రి సమయాలలో గస్తీ పటిష్టంగా నిర్వహిస్తే నేరాలు నియంత్రించవచ్చు అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధులలో ముఖ్యమైన ప్రదేశాలలో, రహదారులపై తప్పని సరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చెయ్యాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చెయ్యడం వల్ల ఆ ప్రాంతాలలో నేరాలు నియంత్రించవచ్చు అన్నారు. ఒకవేళ ఏదైనా నేరం జరిగిన నేరస్తుడిని త్వరగా గుర్తించవచ్చునన్నారు. ప్రజలకు సీసీ కెమెరాల గురించి విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.చీటింగ్ కేసులు, ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాల పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇటీవల ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని అదే విధంగా సైబర్ నేరగాళ్లు 4జి టూ 5జి అంటూ కొత్తరకం మోసం తెరతీశారన్నారు. సర్వీస్ నిలిచిపోతుందని భయపెట్టి.. లింక్‌‌లు పంపుతున్నరన్నారు. లింక్ ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకు అకౌంట్ లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించుకుని అందులోని సొమ్మును స్వాహా చేస్తున్నారని, వాటిని కట్టడి చెయ్యడానికి ప్రజలకు సైబర్ నేరాలు, ఆన్లైన్ లోన్ యాప్ ల మోసాల గురించి విస్తృత అవగహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి ఉంచాలని ,POCSO కేసులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి అని అడిగి దర్యాప్తు త్వరగా ముగించి చార్జి షీట్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు మరియు మహిళలు, బాలికల అదృశ్యం కేసుల్లో సమగ్ర విచారణ జరిపి అదృశ్యమైన వారి ఆచూకీ త్వరగా తెలుసుకోవాలన్నారు.మట్కా,జూదం , క్రికెట్ బెట్టింగ్, గుట్కా మొదలగు అసాంఘిక కార్యకలాపాలఫై ప్రత్యేక నిఘా ఉంచి పూర్తిగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల పై ప్రత్యేక దృష్టి ఉంచాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు (సిగ్నల్స్ )ఏర్పాటు చేయాలని,ప్రమాదాల నివారణకు కావలసిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆర్. రమణ గారు, ఆళ్లగడ్డ డిఎస్పి వెంకటరామయ్య గారు, డోన్ డిఎస్పి వై శ్రీనివాస రెడ్డి గారు సిఐ లు ఎస్ఐ లు పాల్గొన్నారు.

About Author