PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేర సమీక్ష సమావేశం : జిల్లా ఎస్పీ

1 min read

– పెండింగ్ కేసుల పై డిఎస్పీ స్ధాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి.
పల్లెవెలుగు,వెబ్ కర్నూలు: శుక్రవారం స్ధానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో జిల్లా ఎస్పీ గారు నెల వారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించి పోలీసు అధికారులతో మాట్లాడారు. కర్నూలు , పత్తికొండ , ఆదోని సబ్ డివిజన్ లోని పెండింగ్ కేసుల గురించి జిల్లా ఎస్పీ గారు సమీక్షించారు. పెండింగ్ కేసుల పై డిఎస్పీ స్ధాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పెండింగ్ కేసులు బాగా తగ్గించే విధంగా అందరూ బాగా కృషి చేయాలన్నారు.సమస్యాత్మక ప్రాంతాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులను అభినందిస్తున్నామన్నారు. జిల్లాలోని ఇతర సమస్యాత్మక పట్టణాలు, గ్రామాలలో ప్రజల భధ్రతకు మరిన్ని సిసి కెమెరాలు ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.రోడ్డు ప్రమాదాలు జరగకుండా డ్రమ్ములతో మలుపులు ఉండే విధంగా జిగ్ జాగ్ రేడియం తో బారీ కేడ్స్ ను ఏర్పాటు చేయించాలన్నారు. లాంగ్ పెండింగ్ కేసులు, యుఐ కేసులు, ఐపిసి కేసులు, ఎక్సైజ్ కేసులు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయో అని పోలీసుస్టేషన్ ల వారీగా పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఎన్ని కేసులు చార్జీషీట్లు వేశారు, ఎన్ని కేసులు ఫైలింగ్ చేశారనే విషయాలను ఆరా తీశారు. కోర్టుల నుండి సిసి నెంబర్లు త్వరగా తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసుల గురించి పూర్తిగా ఆరా తీసి ఇయర్ ఎండింగ్ లోపు పెండింగ్ కేసులు బాగా తగ్గించాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఈ – చలనాలను బాగా రీకవరీ చేయాలన్నారు. లాంగ్ పెండింగ్ లో ఉన్న గ్రేవ్ , నాన్ గ్రేవ్ కేసుల్లో దర్యాప్తులు, త్వరితగతిన విచారణలు పూర్తి చేయాలన్నారు. నవంబర్ 12 న జరగబోయే జాతీయ లోక్అదాలత్ లో అధిక సంఖ్యలో రాజీ అయ్యే కేసులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నేర సమీక్షా సమావేశంలో సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ ఐపీఎస్ గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డిఎస్పీలు యుగంధర్ బాబు , వినోద్ కుమార్, శ్రీనివాసులు, కెవి మహేష్ మరియు సిఐలు , ఎస్సైలు పాల్గొన్నారు.

About Author