PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాలల్లో నేరస్వభావాన్ని నిమంత్రించాలి – సి.హెచ్. వెంకట నాగ శ్రీనివాసరావు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శనివారం కర్నూల్ నగరంలోని స్థానిక జిల్లా కోర్ట్ లోని లోక్ అదాలత్ కోర్టు ప్రాంగణంలో పోలీసులకు బాలల్లో నేరస్వభావాన్ని నియంత్రించడం పై శిక్షణ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సి.హెచ్. వెంకట నాగ శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ మెజిస్ట్రేట్ శ్రీమతి టీ. జ్యోత్స్న దేవి, శాశ్వత లోక్ అదాలత్ ప్రజా వినియోగ సేవలు అధ్యక్షుడు వెంకట హరినాథ్, కర్నూల్ బాలుర అబ్జర్వేషన్ హోమ్స్ సూపరిండెంట్ హుస్సేన్ భాష, చైర్ పర్సన్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ శ్రీమతి జుబేదా బేగం, దిశా పోలీస్ స్టేషన్ డి.ఎస్.పి. ఐ. సుధాకర్ రెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి వెంకట లక్ష్మమ్మ, సైకియాట్రిస్ట్ డాక్టర్ యతిరాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాల నేరస్తుల్లో వుండే నేర స్వభావాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి వారికి కౌన్సిలింగ్, విద్యాబోధన ద్వారా వారిలో మార్పు తీసుకురావలసిన అవసరం ఎంతైనా వుందని, అలాగే బాల నేరస్తుల్లో  దారి తప్పిన బాలలో నేర స్వభావాన్ని నియంత్రించి మంచి మార్గంలో నడిపించేందుకు అందరు కృషి చేయాలని అన్నారు. అనంతరం పోలీసులకు, న్యాయ విద్యార్థులకు, పారా లీగల్ వాలంటీర్స్ కు జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015, ఫోక్సొ ఆక్ట్ 2012, ముందస్తు అరెస్టు, అరెస్ట్ గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు, పోలీసులు, న్యాయవిద్యార్థులు, పారా లీగల్ వాలంటరీస్, తదితరులు పాల్గొన్నారు.

About Author