నేర సమీక్ష సమావేశం…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి పి శ్రీదేవి తన కార్యాలయంలో ఈరోజు కర్నూలు మరియు నంద్యాల జిల్లాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. మహమ్మారి నాటుసారాయిని జిల్లా నుండి సమూలంగా నిర్మూలించడానికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నవోదయం 2.0 అమలు చేస్తున్న విధానం గూర్చి పలు ఆదేశాలు జారీ చేశారు . సారా తయారుదారుని నుండి మరియు బెల్లం సరఫరాదారుల పై కేసులను నమోదుచేసి వారందరినీ బైండోవర్ చేయాలంటూ, ఇప్పటికే సారా తయారు చేయడం మానుకున్న గ్రామాల లో గడిచిన రెండు నెలల్లో కేసులు నమోదు కానిపక్షంలో వాటిని సంబంధిత గ్రామ సభల్లో గ్రామ కమిటీ తీర్మానం ద్వారా నాటుసారారహిత గ్రామం అని ప్రకటించాలి అదే విధంగా ప్రతి కానిస్టేబుల్ కు బీట్ పరిధిని నిర్ణయించడం ద్వారా సరిగా నిర్వహించే విధంగా చూడాలని , నాటుసారా రహిత గ్రామాలలో పర్యటించి నాటుసారా తయారు కాకుండా చర్యలు తీసుకోవాలని , సమస్యాత్మక గ్రామాల్లో దాడులు నిర్వహించేటప్పుడు అక్కడి లా అండ్ ఆర్డర్ పోలీసుల సహాయం తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక తెలంగాణ నుండి వచ్చే సుంకం చెల్లించని అక్రమమద్యంను అరికట్టాలి అని తెలిపారు .ఈ సమావేశం లో లో అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీ మచ్చ సుధీర్ బాబు మరియు నంద్యాల జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీ రవికుమార్ ,అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ లు శ్రీ డి రామకృష్ణారెడ్డి, వి .రాముడు మరియు శ్రీ. రాజశేఖర్ గౌడ్ లు గ మరియు కర్నూలు మరియు నంద్యాల జిల్లా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు అందరూ పాల్గొన్నారు.
