PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ర‌ష్యా, ఉక్రెయిన్ సంక్షోభం.. సామాన్యుడి జేబుకు చిల్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య నెల‌కొన్న వివాదం .. దేశంలోని సామాన్యుడి పై తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది. దేశంలో ఎంతో డిమాండ్ ఉన్నటువంటి సన్ ఫ్లవర్‌‌ నూనెను ఉక్రెయిన్‌ నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. దీంతో ఉక్రెయిన్ సంక్షోభం వల్ల ఆయిల్ కొరత ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కొరత ప్రభావంతో భారత మార్కెట్లలో సన్‌ ఫ్లవర్‌‌ ఆయిల్‌ ధరలు భారీగా పెరగనున్నాయి. రష్యా, అర్జెంటీనావంటి దేశాల ద్వారా భారత మార్కెట్లోకి సన్ ఫ్లవర్ వంట నూనె దిగుమతి అవుతోంది. అయితే ఉక్రెయిన్, రష్యా వివాదం వల్ల ఇప్పుడు ఈ దిగుమతి దాదాపుగా ఆగిపోనుంది. ఇండియాలో సన్‌ఫ్లవర్ కుకింగ్ ఆయిల్ దిగుమతికి ఉక్రెయిన్‌ ప్రధాన ఆధారంగా ఉంది.

                               

About Author