NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బురదజల్లడం… మానండి :ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి

1 min read

చాగలమర్రి:దేశంలో ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు ఆళ్లగడ్డ శాసన సభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి.  సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధిని చూసి ఓర్వలేక… ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయని ఆరోపించారు. ఆదివారం చాగలమర్రి లోని వైస్సార్ ఫంక్షన్ హాల్ లో మండల ఉపాధ్యక్షుడు  ముల్లా రఫీ మేనల్లుడు కరీముల్లా వివాహ వేడుకలకు హాజరైన సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు.  సీఎం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమైన  ప్రజల ఆశీస్సులు ఉన్న ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వాన్ని ఓడించలేరని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న విషయాన్ని సాక్షాత్తు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రశంసించడ్డానీ ఎమ్మెల్యే గుర్తు చేశారు అలాగే 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంటారని వెల్లడించారు. ప్రభుత్వం పనితీరును ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రశంసించడం మీకు గుర్తు లేదా అని  ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నించారు. సంక్షేమ పథకాల అమలులో, జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ  భారతదేశం మొత్తం మీద మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ప్రతిపక్షాల అబద్ధపు మాటలను ప్రజలు లు నమ్మే  పరిస్థితుల్లో లేరన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు వీరభద్రుడు,తాలూక వైఎస్ఆర్సిపి నాయకులు దామోదర్ రెడ్డి, సింగం భరత్ కుమార్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు రఫీ మండల కో ఆప్షన్ సభ్యులు ఇబ్రహీం,  చాగలమర్రి మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ షేక్ సుహెల్, జిల్లా ప్రచార కార్యదర్శి గణేష్ రెడ్డి , చిత్రకారుడు ఇబ్రహీం, అబ్దుల్లా,బబ్లు తోడేళ్ళపల్లె సర్పంచ్ గోవిందయ్య, వార్డు సభ్యులు బురానుద్దీన్, మాబు షరీఫ్, ముల్లా ఖాదర్బాషా ఐడియా బాబు, మెడికల్ స్టోర్ నాగేంద్ర కుమార్, రమణ,మదర్ వలి షబ్బీర్, తదితరులు పాల్గొన్నారు.

About Author