బాలనాగిరెడ్డి కుటుంబం పై విమర్శలు చేసే ముందు గతాన్ని గుర్తు చేసుకో
1 min readబాలనాగిరెడ్డి, రాంపురం రెడ్డి సోదరుల ద్వారా నే రాఘవేంద్ర రెడ్డి కి గుర్తింపు
వై. బాలనాగిరెడ్డి చేసిన అభివృద్ధిని వివరించేందుకు మేము సిద్ధం
మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర సవాల్
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుటుంబ పై టిడిపి అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి వారి తమ్ముడు విమర్శలు చేసే ముందు గతాన్ని గుర్తు చేసుకుని మాట్లాడాలని మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, మండల ఉపాధ్యక్షులు పులికుక్క రాఘవేంద్ర లు సూచించారు. సోమవారం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో స్థానిక బిసి సంఘాల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 13వ తేదిన జరిగే ఎన్నికల్లో మా బీసీ నాయకులు ఏకమై మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ని నాల్గవ సారీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం మంత్రాలయం టీడీపీ అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి, వారి తమ్ముడు మా ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పై విమర్శలు చేసే ముందు తన గతాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. మాధవరం రామిరెడ్డి గత 10 సంవత్సరాలుగా ప్రజా రాజ్యం, టీడీపీ పార్టీల్లో ఉన్న ఎక్కడా కూడా గుర్తింపు రాలేదని వైకాపా లోకి చేరిన వెంటనే మా ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, రాంపురం రెడ్డి సోదరుల సహాకారంతో జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ పదవి కేటాయించడంతోనే నీకు నీ కుటుంబానికి ఇంత గుర్తింపు వచ్చిందని తెలిపారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులను వివరించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాఘవేంద్ర రెడ్డి గతంలో ఆస్తి ఎంత ఇప్పుడు నీ ఆస్తి ఎంత నువ్వు ఏ పార్టీ లో డబ్బులు సంపాదించుకున్నావో గుర్తు లేదా నీకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు చేయడానికి కూడా ఓ పద్ధతి ఉంటుందని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి సహాయ సహకారాలతో నియోజకవర్గంలో ఎంతో మంది బిసీ సోదరుల ను ప్రజా ప్రతినిధులు గా తీర్చి దిద్దడం జరిగిందన్నారు. అభివృద్ధి విషయంలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని ప్రజలకు తెలుసునని అన్నారు. ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం వై. బాలనాగిరెడ్డి నాయకత్వం వర్దిలాలి, బిసీలంతా రాంపురం రెడ్డి సోదరుల వెంటే, జై జగన్ జై జై జగన్ అంటూ నినాదాలు చేశారు.