ఆదరించిన పార్టీని విమర్శలు చేయడమా
1 min read– కాంగ్రెస్ పార్టీ బనగానపల్లె నియోజకవర్గం ఇంచార్జ్ బాలు యాదవ్
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం ఆదరించి పదవులు అనుభవించి ఉమ్మడి రాష్ట్రాలకు సీఎంగా చేసిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని బనగానపల్లె నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బాలు యాదవ్ పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గంలోని కోవెలకుంట్ల కాంగ్రెస్ పార్టీ బనగానపల్లె ఇంచార్జ్ బాలు యాదవ్ విలేఖరుల సమావేశం నిర్వహించారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తగదన్నారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది బిజెపి పార్టీ దరిద్రం లాంటిది కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి ఎమ్మెల్యేగా స్పీకర్గా సీఎంగా. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సిగ్గుచేటు కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో ప్రజలకు చెప్పిన హామీలు అన్ని నిర్వహించారు. బిజెపి పార్టీ 2014లో అధికారంలో దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది అది దేశంలో చిన్న పిల్లవాణ్ణి అడిగిన చెబుతాడు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు రాలేదు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు పూర్తి కాలేదు. రైతుకు గిట్టుబాటు ధర లేదు దేశంలో రైల్వేస్టేషన్లో ఏర్పాట్లు ప్రైవేట్ పరంగా చేస్తా ఉన్నారు. పెట్రోల్ డీజిల్ తగ్గిస్తామన్నారు, గ్యాస్ సిలిండర్ 400 కి ఇస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి పార్టీని చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమన్నారు.నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మీ ఆస్తుల్ని కాపాడుకొని కోసం బిజెపిలో చేరారు, ఒకటి మునిగిపోయే పడవలో కాలు పెట్టారు సంతోషం మీలాంటి చీడపురుగులు పార్టీలో లేనంతవరకు మంచిదని కాంగ్రెస్ పార్టీ బనగానపల్లె ఇంచార్జ్ బాలు యాదవ్ విమర్శించారు.రాబోయేది 2024లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం మాలాంటి యువత ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ పార్టీకి కష్టాల్లో ఉన్న పార్టీకి పైకి తెస్తామని బాలు యాదవ్ అన్నారు.ఈ కార్యక్రమంలో పాపన్న యాదవ్ , ఓబులేసు , పాల్గొన్నారు.