పంట దెబ్బతిన్న రైతులకు… ఇన్సూరెన్స్ విడుదల..
1 min readపల్లెవెలుగు వెబ్, మహానంది: రాష్ట్ర వ్యాప్తంగాఅకాల వర్షాలు వరదల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు త్వరలో ఇన్సూరెన్స్ విడుదల చేయనున్నట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ మహానందిలో తెలిపారు.దైవ దర్శనం కుటుంబ సమేతంగా దైవ దర్శనార్ధమై వచ్చిన ఆయన దర్శనం అనంతరం మాట్లాడుతూ పంటలు దెబ్బతిన్న రైతుల ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 540 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసిందన్నారు .కర్నూలు జిల్లా కి 25 కోట్లు విడుదలైన టు తెలిపారు .ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని పంట కోత ప్రయోగం ద్వారా ఆయా గ్రామాల్లో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్సూరెన్స్ విడుదల చేపడుతుందని తెలిపారు .ఆర్ బి కె బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వీటి ద్వారానే రైతులకు కావాల్సిన రసాయనిక మరియు క్రిమిసంహారక మందులతోపాటు యంత్ర పనిముట్లు కూడా అందజేస్తున్నట్లు తెలిపారు .ఈ క్రాప్ బుకింగ్ తప్పనిసరి గా రైతులు చేయించుకోవాలన్నారు .ఆర్ బి కె లకు మాత్రమే రసాయనిక ఎరువులు పంపిణీ చేస్తున్నారని ప్రైవేటు వ్యాపారులు ఇవ్వడంలేదని ప్రశ్నించగా అటువంటిదేమీ లేదన్నారు .ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీల చెల్లించాల్సిన ప్రీమియం పక్కదారి మళ్ళించి ఉంది కదా ఎలా రైతుల గురించి న్యూస్ ఇస్తారని అడుగగా అలాంటిది ఏమీ లేదని ప్రభుత్వం ఇన్సూరెన్స్ పంటలు నష్టపోయిన రైతులకు అందించడానికి కృతనిశ్చయంతో ఉందన్నారు .ఈ కార్యక్రమంలో ఆయన వెంట మహానంది దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆలయ చైర్మన్ మహేశ్వరరెడ్డి మహానంది మండల వ్యవసాయ శాఖ ఏవో సుబ్బారెడ్డి ,బండి ఆత్మకూరు ఏవో నాగేశ్వర్రెడ్డి నంద్యాల ఏడిఏ మరియు జె డి తదితరులు పాల్గొన్నారు.