క్రాప్ హాలిడే పాపం వైసీపీదే !
1 min readపల్లెవెలుగువెబ్ : కోనసీమలో క్రాప్ హాలిడే పాపం వైసీపీదే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రైతాంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పంట విరామ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించరని… దాదాపు రూ.475 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. రైతుల క్రాప్ హాలీడే ప్రకటనతో రాత్రికి రాత్రే..వారి ఖాతాల్లో రూ.139కోట్లు జమ చేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. క్రాప్ హాలీడే ప్రకటించిన మండలాల్లో సాగు నీరు అందుబాటులో అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు.