గ్రామంలో పకడ్బందీగా పంట నమోదు..
1 min read– ఖరీఫ్ పంట నమోదు పై రైతులతో గ్రామ సభ..
– గ్రామ సర్పంచ్ డా.. రాజశేఖర్, ఎంపీటీసీ లక్ష్మి నారాయణ..
– అగ్రికల్చర్ అసిస్టెంట్ క్రాంతి కుమార్..
పల్లెవెలుగు వెబ్ కల్లూరు అర్బన్ : మండల పరిధిలోని మొలగవల్లి కొట్టాల గ్రామం రైతు భరోసా కేంద్రం 3 నందు గ్రామ వ్యవసాయ సలహా మండలి సభ్యులతో, గ్రామ రైతులతో గ్రామ సర్పంచ్ డాక్టర్ రాజశేఖర్ అధ్యక్షతన గ్రామ సభ శుక్రవారం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశం నందు అగ్రికల్చర్ అసిస్టెంట్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ గ్రామంలో 2023-24 ఖరీఫ్ సీజన్ సంబంధించి పంటలు వేసినటువంటి రైతులందరివి పంట నమోదు చేయడం జరిగిందని తెలియచేశారు. ఇందుకుగాను ఈ గ్రామ సభలో పంట నమోదు చేసినటువంటి రైతుల వివరాలన్నీ చదివి రైతులకు వినిపించడం జరిగినది. అందుకుగాను గ్రామంలో పగడ్బందీగా గ్రామ రెవెన్యూ అధికారి వ్యవసాయ అధికారి కలసి పంట నమోదు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం పంట నమోదు జాబితా చదివినటువంటి పేర్లలో ఏవైనా అభ్యంతరాలు ఉన్నచో రెండు రోజులలో రైతు భరోసా కేంద్రానికి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న ప్రభుత్వ పథకాలు రైతులందరూ ఉపయోగించుకోవాలని ప్రస్తుతం శనగ పంటలో తగిన జాగ్రత్తలు పాటించి పంటను సంరక్షించుకోవాలన్నారు.. అనంతరం గ్రామ ఎంపీటీసీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామంలో పంట వేసిన ప్రతి రైతు పేరు పంట నమోదు చేయడం జరిగిందని అయితే ప్రభుత్వం ద్వారా అమలయ్యే పథకాలు పంట నమోదు ద్వారా రైతులకు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఖరీఫ్ ఎలాగైతే చేయించుకున్నారో రబీ పంట నమోదు కూడా పంట వేసిన ప్రతి రైతు చేయించుకోవాలన్నారు.. గ్రామసభ నందు జరిగిన విషయాలన్నీ సమావేశానికి రాలేని మిగతా రైతులకు కూడా వివరించాలని తెలియజేయడం జరిగింది.. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సలహా మండలి సభ్యులు, రైతులు, వాలంటీర్ వీరేష్ తదితరులు పాల్గొన్నారు.