రైతులు పంట నమోదు తప్పనిసరి
1 min read– మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ఖరీఫ్ 2023లో వేసిన పంటలకు గాను రైతులు పంట నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి తెలిపారు, శనివారం ఆమె చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ, పంట నమోదు కార్యక్రమాన్ని ఇప్పటికే మండలంలో వ్యవసాయ సిబ్బంది ప్రారంభించడం జరిగినదని, పొలాల వద్దకే వెళ్లి రైతులతో పట్టణ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆమె తెలిపారు, ఇప్పటివరకు 1200 ఎకరాలలో వరి అలాగే ఇతర పంటలు రైతులు సాగు చేశారు కాబట్టి పంట వేసిన రైతులు తప్పనిసరిగా మీ రెవిన్యూపొలం ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించి ఈ పంట నమోదు చేసుకోవాలని ఆమె తెలియజేశారు, పంట నష్ట పరిహారం పంటల బీమా పరిహారం అలాగే సున్నా వడ్డీ రాయితి మొదలగునవి పొందడానికి ఈ పంట నమోదు తప్పనిసరని ఆమె అన్నారు,చెన్నూరు ,గుర్రంపాడు, రామనపల్లె, కనపర్తి ,బయనపల్లె, శివాలపల్లి మొదలగు రైతు భరోసా కేంద్రాల్లో పంట నమోదు ప్రారంభం అయినదని ఆమె తెలిపారు.