NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అభివృద్ధికి పట్టం కట్టండి..

1 min read
ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్​ కొరముట్ల శ్రీనివాసులు

ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్​ కొరముట్ల శ్రీనివాసులు

– ప్రభుత్వ విప్​ కొరముట్ల శ్రీనివాసులు
పల్లెవెలుగు వెబ్​, చిట్వేలు:ఈ నెల 8న జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని ప్రభుత్వ విప్​ , ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ప్రజలకు పిలుపునిచ్చారు. పరిషత్​ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం చిట్వేలు మండలం రాజు గుంట గ్రామపంచాయతీ చెర్లోపల్లి ఎస్సీ కాలనీ, ఎస్ టి కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన నవరత్నాలు, అభివృద్ధిని చూసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న మండల కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, గంగిరెడ్డి, మోహన్ రెడ్డి, పాటూరి శ్రీనివాసులు రెడ్డి, మహేష్ రెడ్డి, కిషోర్ రెడ్డి, హేమన వర్మ,రమణ, లక్ష్మికర్, గుండల్ రెడ్డి, గులాం భాష, సర్పంచ్ ఈశ్వరయ్య, స్థానిక నాయకులు వెంకటయ్య, లోకేష్, కనకరాజు,, మండలం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author