క్రిప్టో.. ఎప్పటికీ చట్టబద్ధత కల్పించం !
1 min readపల్లెవెలుగువెబ్ : క్రిప్టో కరెన్సీ చట్టబద్ధత పై ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీలు బిట్‌కాయిన్, ఎథిరియంతో పాటు నాన్ ఫంగిబుల్ టోకెన్స్‌కు భారత్‌లో ఎప్పటికీ చట్టబద్ధత లభించదని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ స్పష్టం చేశారు. ప్రైవేట్ క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టేవారు వాటికి ప్రభుత్వం ఆమోదం లేదన్న విషయాన్ని గుర్తించాలని ఆయన హెచ్చరించారు. అంటే, అధికారిక లావాదేవీలకు దేశంలో వీటిని అనుమతించరు. ‘‘క్రిప్టో కరెన్సీలు ఇద్దరు వ్యక్తుల మధ్య విలువ నిర్ణయించబడిన ఆస్తులు మాత్రమే. మీరు బంగారం, వజ్రాల్లాగే క్రిప్టోలు కొనుగోలు చేయవచ్చు. కానీ వాటి విలువకు అధికారిక గుర్తింపు ఉండద’’ని సోమనాథన్ అన్నారు. ఆర్‌బీఐ ప్రవేశపెట్టనున్న డిజిటల్ రూపీ మాత్ర మే చట్టబద్ధమైన వర్చువల్ కరెన్సీ అని అన్నారు.