PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రిప్టో ట్రేడింగ్.. అక్ర‌మ‌మా ? స‌క్ర‌మ‌మా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క్రిప్టో క‌రెన్సీ ట్రేడింగ్ పై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని సుప్రీం కోర్టు కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరింది. క్రిప్టో ట్రేడింగ్ అక్ర‌మ‌మా ? లేదా స‌క్ర‌మ‌మా ? అన్న విష‌యంలో ప్ర‌భుత్వ విధానాన్ని స్ప‌ష్టం చేయాల‌ని కోరింది. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకుఆదేశాలు జారీ చేసింది. బిట్‌కాయిన్స్‌ ట్రేడింగ్‌తో అధిక రాబడుల పేరుతో అజయ్‌ భరద్వాజ్‌ అనే వ్యక్తి, మరికొందరు దేశవ్యాప్తంగా అనేక మందిని మోసం చేశారు. దీంతో వారిపై అనేక చోట్ల ఎఫ్‌ఐఆర్‌లు న‌మోద‌య్యాయి. ఈ ఎఫ్‌ఐఆర్‌లు కొట్టివేయాలని వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో మన దేశంలో అసలు క్రిప్టో కరెన్సీల్లో ట్రేడింగ్‌ అక్రమమో, సక్రమమో చెప్పాలని ధర్మాసనం అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భటిని కోరింది.

                                       

About Author