క్రిప్టో కరెన్సీ ఢమాల్ !
1 min readపల్లెవెలుగువెబ్ : క్రిప్టో కరెన్సీలు .. స్టాక్ మార్కెట్ల బాట పట్టాయి. వరుసగా నష్టలతో ట్రేడ్ అవుతున్నాయి. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 3.10 శాతం తగ్గి రూ.29.73 లక్షల వద్ద కొనసాగుతుంటే.. మార్కెట్ విలువ రూ.54.97 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ గత 24 గంటల్లో 4.14 శాతం తగ్గి రూ.2,05,119 వద్ద ట్రేడ్ అవుతోంది. దీని మార్కెట్ విలువ రూ.24.24 లక్షల కోట్లుగా ఉంది. ఇక ఇతర కరెన్సీ వీలువ కూడా భారీగా పడిపోయింది. రష్యా ఉక్రెయిన్ సంక్షోభ ప్రభావం వీటి మీద కూడా పడింది.